సుల్తానాబాద్: సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ నియామకం

సుల్తానాబాద్ కోర్టు సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ గా సీనియర్ న్యాయవాది నేరెళ్ళ శంకరయ్యను నియమిస్తూ పెద్దపల్లి జిల్లా జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం సుల్తానాబాద్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి గణేష్ సమక్షంలో శంకరయ్య పదవీ బాధ్యతలు చేపట్టగా, జడ్జి, న్యాయవాదులు శంకరయ్యను సన్మానించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పడాల శ్రీరాములు, కార్యదర్శి జోగుల రమేష్, ఏజీపీ ఆంజనేయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్