శాసనమండలిలో వైసీపీకి భారీ మెజార్టీ ఉంది. ఇదే ఇప్పుడు కూటమికి అతిపెద్ద సమస్యగా మారింది. మండలిలో వైసీపీకి 30 మంది దాకా ఎమ్మెల్సీలు ఉన్నారు. తాజాగా 12 మంది వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీ వైపు చూస్తున్నారని సమాచారం. ఇలా జరిగితే 30 మంది దాకా ఉన్న వైసీపీ బలం 18కి పడిపోతుంది. దీంతో కూటమికి మ్యాజిక్ ఫిగర్ 28కి ఈజీగా చేరుకుంటుందనే చర్చ మొదలైంది.