AP: తుని మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ ఎన్నిక ఊహించని మలుపు తిరుగుతోంది. 14 మంది YCP కౌన్సిలర్లు మూకుమ్మడిగా రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. YCPకి చెందిన 28 మంది కౌన్సిలర్లలో 10 మంది TDPలో చేరారు. ఒకరు తటస్థంగా ఉండగా, మిగిలిన 17 మందిలో 8 మంది TDPలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో ఛైర్‌పర్సన్ ఏలూరి సుధారాణి ఇంట్లో YCP కౌన్సిలర్లు సమావేశమై రాజీనామాకు సిద్ధమైనట్లు చర్చ సాగుతోంది.