రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లలో దారుణం చోటుచేసుకుంది. వ్యవసాయం పొలంలో ఆడుకుంటూ ఓ ఐదేళ్ల బాలుడు ప్రహ్లాద్ ప్రమాదవశాత్తు 32 అడుగుల లోతైన బోరు బావిలో పడిపోయాడు. ఘటనా స్థలంలో కుటుంబ సభ్యులు ఘోరంగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బలగాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. అలాగే బాలుడికి వైద్యులు పైప్ ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు.