TG: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల వద్ద 100 మీ. వరకు మట్టి ఉందని రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బంది తెలిపారు. 'కార్మికులు 14వ కి.మీ వద్ద చిక్కుకున్నారు. మేం 13.5 కి.మీ వరకు వెళ్లాం. అక్కడ మట్టి, బురద, నీటితో నిండిపోయింది. దాన్ని తొలగించి వారి వద్దకు వెళ్లాలి. అందుకోసం నీటిని తోడుతున్నాం. ఈ మొత్తం ప్రాసెస్‌కు సుమారు 10-12 రోజులు పట్టే అవకాశం ఉంది' అని తెలిపారు.