ఏపీలో నిరుద్యోగులకు పోలీస్ శాఖ త్వరలో శుభవార్త చెప్పనుంది. పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీపై హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు ఒకే రోజు కీలక ప్రకటనలు చేశారు. పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు డీజీపీ ద్వారకాతిరుమలరావు తెలిపారు. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభం కానుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పోలీస్ శాఖలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు.