మహారాష్ట్ర బీజేపి ఎంపీ ధనంజయ్ మహాదిక్ మహిళలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న MP ధనంజయ్ 'లడ్కీ బహిన్ స్కీమ్ కింద రూ.1,500 పొందిన మహిళ ఎవరైనా కాంగ్రెస్ ర్యాలీలో కనిపిస్తే వారి ఫొటోలు తీయండి. ఆ తర్వాత వాళ్లను మేం జాగ్రత్తగా చూసుకుంటాం' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబడుతోంది.