మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ (వీడియో)

79చూసినవారు
TG: పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని ఐటీఐ సమీపంలో గత మూడు రోజులుగా గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఇది గమనించిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ ముత్యాల శంకర్ మానవత్వం చాటుకున్నారు. ఆయన వెంటనే 108 వాహనానికి సమాచారం అందించి అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో హెడ్ కానిస్టేబుల్ శంకర్‌ను పలువురు అభినందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్