AP: 11 సీట్లు వచ్చినా వైసీపీ నేతలు నోర్లు లేస్తున్నాయన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. విజయవాడలో పేర్ని నాని మాట్లాడుతూ.. ‘అధికారం ఉన్నా లేకున్నా వైసీపీ కార్యకర్తలు ఎప్పుడూ ఒకేలా ఉంటారు. వైసీపీ కార్యకర్తల తాట తీయడం పక్కన పెట్టి పవన్ సొంత పార్టీ శ్రేణులను పట్టించుకోవడం మంచిది. నిన్ను నమ్ముకున్న కార్యకర్తలే అన్యాయం అవుతున్నారు.’ అని సెటైర్లు వేశారు.