యంగ్ హీరో నార్నే నితిన్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఆదివారం నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్లో జరిగిన ఈ వేడుకలకు ఎన్టీఆర్, ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, తనయులు అభయ్, భార్గవ్తో హాజరయ్యారు. పెళ్లి వేడుకల్లో ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎన్టీఆర్ లుక్స్ వైరల్ అయ్యాయి. బాలీవుడ్ చిత్రం వార్-2లో ఎన్టీఆర్ లుక్ ఇదేనా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ వేడుకలో హీరోలు కళ్యాణ్ రామ్, వెంకటేశ్ తదితరులు సందడి చేశారు.