భీమ్‌సేన చీఫ్ సత్పల్ తన్వర్‌ను చంపేస్తామని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ బెదిరించినందుకు అతడిపై గురుగ్రామ్‌లో బెదిరింపుల కేసు నమోదైంది. అన్మోల్ జింబాబ్వే, కెన్యా ఫోన్ నెంబర్లను వాడుతూ అమెరికా, కెనడాల నుంచి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు. తన్వర్‌ను నరికి చంపేస్తామంటూ అన్మోల్ గ్యాంగ్ బెదిరించినట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.