జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం

70చూసినవారు
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ప్రారంభించాలని సీబీఐ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత త్వరగా విచారణ పూర్తి కావాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇప్పటికే తగిన ఆదేశాలు ఇచ్చామని జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం గుర్తు చేసింది.

సంబంధిత పోస్ట్