ఏపీ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ వేళ చిత్తూరు జిల్లా కుప్పంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. కుప్పంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దుకాణాలు తెరవకూడదని పోలీసులు హెచ్చరించడంతో.. వ్యాపారులు తమ కార్యకలాపాలకు విరామం ఇచ్చారు. మరోవైపు అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు బయట తిరగడానికి జంకుతున్నారు.