ఎర్రచందనం స్మగ్లర్లను అడ్డుకున్న టాస్క్ ఫోర్స్

57చూసినవారు
ఎర్రచందనం స్మగ్లర్లను అడ్డుకున్న టాస్క్ ఫోర్స్
తిరుపతి సమీపంలోని శ్రీవారిమెట్టు వైపు ఉన్న శేషాచలం అడవుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎర్రచందనం స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు పోలీసులు అడ్డుకుని, ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి కారు, రంపాలు, గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి.శ్రీనివాస్ అధ్వర్యంలో కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో కారులో నుంచి దిగిన వారిని చుట్టుముట్టగా పరారయ్యారు. వెంబడించి ఇద్దరిని పట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్