కాకినాడలో ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక కల్పనా సెంటర్‌లో అతివేగంతో వచ్చిన రెండు బైక్‌లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కారు లోపల మద్యం సీసాను పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో యువకుడు కారు నడిపారని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.