తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం గందరగోళం నెలకొంది. కేటీఆర్ పై కేసుకు సంబంధించి చర్చించాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టబట్టారు. ఇందుకు స్పీకర్ అనుమతివ్వలేదు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతుండగా బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులు బాహబాహికి దిగి వాటర్ బాటిళ్లను విసిరేసుకున్నారు. ఇంతలోనే స్పీకర్ సభను వాయిదా వేశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.