ALERT: ఒకవైపు ఎండలు, మరోవైపు పిడుగులతో వానలు

56చూసినవారు
ALERT: ఒకవైపు ఎండలు, మరోవైపు పిడుగులతో వానలు
AP: ఏప్రిల్ నుంచి జూన్ వరకు రాష్ట్రంలో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ 26, రేపు 28 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. మంగళవారం మన్యంలో 10, విజయనగరంలో 6, శ్రీకాకుళంలో 6, అల్లూరిలో 3, తూ.గో.లో ఒక మండలంలో వడగాలులు వీస్తాయంది. మరోవైపు మంగళవారం నుంచి శనివారం వరకు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్