ఇన్‌యాక్టివ్ లేదా వేరే వారికి కేటాయించిన మొబైల్ నంబర్లకు ఏప్రిల్ 1 నుంచి UPI సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు బ్యాంకులు, పేమెంట్ సేవలందించే ప్రొవైడర్లకు.. NPCI ఆదేశాలు జారీ చేసింది. ఎక్కువకాలం పాటు వినియోగంలో లేని మొబైల్ నంబర్లను టెలికాం కంపెనీలు వేరొకరికి కేటాయిస్తుంటాయి. దీంతో దీర్ఘకాలం పాటు మనం వాడే నంబర్లు వేరొకరికి చేరుతుంటాయి. మన యూపీఐ ఖాతాలతో అనధికారిక, మోసపూరిత లావాదేవీలు జరిగే అవకాశం ఉంది.