భారత ప్రభుత్వ విభాగం 2024 ఆగస్టులో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ స్కీమ్‌ను 2025 ఏప్రిల్ 1 నుంచి అమలు కానుంది. ఈ కొత్త పెన్షన్ స్కీమ్ ద్వారా 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం లభిస్తుంది. ఈ క్రమంలో కనీసం 25 సంవత్సరాలు సేవలు అందించిన ఉద్యోగులు తమ చివరి 12 నెలల ప్రాథమిక జీతం ఆధారంగా 50% పెన్షన్ పొందుతారు. ఈ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల రిటైర్‌మెంట్ తర్వాత వారికి ఆర్థిక భద్రతను అందిస్తుంది.