ప్రస్తుత నిబంధనల ప్రకారం బ్యాంకుల్లోని డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు జమయ్యే వార్షిక వడ్డీ రూ.50,000 దాటితే.. దానిపై టీడీఎస్ వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.లక్షకు పెంపు. 60 ఏళ్ల లోపు వ్యక్తులకు ఈ మొత్తాన్ని రూ.40,000 నుంచి రూ.50,000కు పెంచారు. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్-ఎల్ఆర్ఎస్ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.7 లక్షలు దాటితే టీసీఎస్ వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ పరిమితి రూ.10 లక్షలకు పెరిగింది.