AP: వైసీపీ మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా ఆమె స్పందించారు. వైసీపీ అధినేత జగన్‌తోనే చివరి వరకు తమ ప్రయాణం కొనసాగుతుందని మాజీ హోంమంత్రి సుచరిత, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి మేకతోటి దయాసాగర్ తెలిపారు. గతంలో కూడా తాము టీడీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగిందని, అప్పుడు తాము వైసీపీలోనే కొనసాగుతామని స్పష్టం చేశామన్నారు. రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమన్నారు.