ప్రేమ పేరుతో యువతిని లొంగ తీసుకుని పెళ్లికి నిరాకరించి మోసం చేసిన వ్యక్తిపై విశాఖ పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సీఐ బాలకృష్ణ ఆదివారం తెలిపారు. తాటిచెట్ల పాలెంకు చెందిన యువతిని భీమిలికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి 2017 నుంచి ప్రేమిస్తూ లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు తెలిపారు. పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆమె కోరడంతో నిరాకరించినట్లు పేర్కొన్నారు.