అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మన్యప్రాంతమైన పినకోట పంచాయతీ బలగరువు గ్రామానికి విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ను ఆదివాసులు కలిశారు. ఏ ఒక్క నాయకుడు కూడా తిరగలేని గ్రామాలా అభివృద్ధి కోసం.. ముందడుగు వేసిన ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. వారి ప్రాతంలోని సమస్యలను పవన్ దృష్టికి.. ఆదివాసి జేఏసీ ఉపాధ్యక్షులు, జనసేన నాయకులు తుమ్మి అప్పలరాజు దొర తీసుకువచ్చారు.