8.5 కిలోల లిక్విడ్ గంజాయి స్వాధీనం

76చూసినవారు
8.5 కిలోల లిక్విడ్ గంజాయి స్వాధీనం
గంజాయి ర‌వాణా ఆగ‌డం లేదు. పోలీసులు ఎంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించినా స్మ‌గ్ల‌ర్లు ఎక్క‌డా త‌గ్గడం లేదు. శుక్ర‌వారం అర్ధ‌రాత్రి 8. 5 కిలోల లిక్విడ్ గంజాయిని భీమిలి స‌మీపంలోని పీఎంపాలెం క్రికెట్ స్టేడియం వ‌ద్ద త‌ర‌లిస్తున్న ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు. వారిని నుంచి లిక్విడ్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ద్విచ‌క్ర‌వాహ‌నంపై ఒడిశాకు ర‌వాణా చేస్తుండ‌గా పోలీసులు దాడులు నిర్వ‌హించారు.

సంబంధిత పోస్ట్