అభిజిత్ పరిశ్రమ కార్మికులకు ఈనెల 18వ తేదీలోగా బోనస్ చెల్లించాలని ఎస్ఈజెడ్ లేబర్ కమిషనర్ తో జరిగిన చర్చల్లో నిర్ణయం తీసుకోవడం జరిగిందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్. రాము తెలిపారు. కంపెనీ గేటు వద్ద శుక్రవారం కార్మికులతో నిర్వహించిన సమావేశంలో చర్చల వివరాలు వెల్లడించారు. కంపెనీ తెరిచిన వెంటనే కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని లేబర్ కమిషనర్ ఆదేశించినట్లు పేర్కొన్నారు.