బుచ్చయ్యపేట మండలం బంగారు మెట్ట - పి. భీమవరం మార్గం మధ్యలో వెలిసిన శ్రీ శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయ ప్రథమ వార్షిక మహోత్సవము తమరాన దాసు మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈనెల 29న నిర్వహించనున్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి రుద్రాభిషేకం, స్వామివారి అలంకారం, స్వామివారి దర్శనం జరుగును. రుద్రాభిషేకం చేసుకునే ఆ దంపతులు ముందుగా పేర్లు చెప్పవలసిందిగా భక్తులను కోరారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించనున్నారు.