గాజువాక 71వ వార్డు ఆటోనగర్ దరి తోకాడ గ్రామంలో గల స్మశాన వాటిక ఎన్నో ఏళ్లగా అభివృద్ధికి నోచుకోలేదు. దహన సంస్కరాలు నిర్వహించడానికి వేసిన షెడ్లు శిధిలావ్యవస్థకు చేరుకున్నాయి. చెట్లు తుప్పలతో స్మశాన వాటిక నిండిపోయింది. పక్కన ఉన్న 69, 70 వార్డుల్లో స్మశాన వాటిక అభివృద్ధి చెందగా తోకడ స్మశానం మాత్రం శిథిలా వ్యవస్థకు చేరుకోవడం గమనార్హం. కూటమి ప్రభుత్వంలో ఈ స్మశాన వాటిక అభివృద్ధి చెందాలని స్థానికులు కోరుతున్నారు.