తాను చనిపోతూ మరో నలుగురు ప్రాణాలు కాపాడారు. ఈ నెల 17వ తేదీన విశాఖ జిల్లా దువ్వాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వాసిరెడ్డి రామారావు (57) బ్రెయిన్ డెడ్ అయ్యారు. అవయవ దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో రామారావు ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు, అవయవాలను నలుగురికి మంగళవారం అమర్చారు. మృతదేహానికి కలెక్టర్ హరేందిర ప్రసాద్ పూలమాలలువేసి నివాళులర్పించారు.