రైతాంగం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈనెల 26న నిర్వహించ తలపెట్టిన దేశ వ్యాప్త ఆందోళన కార్యక్రమం జయప్రదం చేయాలని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరట నరసింహమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు కే భవాని పిలుపునిచ్చారు. సోమవారం మాడుగుల మండలంలో శంకరం పంచాయతీలో బొడ్డరేవు గ్రామంలో రైతంగం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కరపత్రాలు పంచుతూ నిరసన తెలియజేశారు.