మాడుగుల: వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేసిన సివిల్ జడ్జి

59చూసినవారు
మాడుగుల: వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేసిన సివిల్ జడ్జి
మాడుగుల కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి స్వర్ణ మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు మాడుగుల మండలంలో గల వివిధ వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆమె మాడుగుల మండలంలో గల నరసయ్యపేట, తాటిపర్తి, కింతలి, మాడుగుల లో గల వివిధ వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాల పరిస్థితిని పరిశీలించారు. వంటశాల పడక గదులు, రీడింగ్ రూమ్ లు, మరుగుదొడ్లు వంటి వాటిని పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్