ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డీ. శ్రీరామచంద్రమూర్తి గొలుగొండ ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ ను ఆదివారం సందర్శించారు. ఈ స్టేషన్ పరిధిలోని గొలుగొండ, నాతవరం మండలాల్లో ఎనిమిది షాపులకు దరఖాస్తు స్వీకరణపై సూచనలు, సలహాలు అందజేశారు. ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ అమల్లోకి తీసుకువస్తుందన్నారు. మద్యం షాపులకు ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.