నర్సీపట్నం: డ్రైవర్లు సూచించిన లోపాలను సరిదిద్దాలి

72చూసినవారు
నర్సీపట్నం: డ్రైవర్లు సూచించిన లోపాలను సరిదిద్దాలి
జిల్లా ప్రజా రవాణా అధికారి కె. పద్మావతి నర్సీపట్నం డిపోను బుధవారం ఆకస్మికంగా తనిఖీలు చేసి సిబ్బంది పని తీరును సమీక్షించారు. అనంతరం ఆమె డిపోలో జరుగుతున్న పనులు పర్యవేక్షించారు. నూతనంగా ఏర్పాటు చేసిన డ్రైవర్ల సంతోషకర వారోత్సవాల్లో పాల్గొన్నారు. డ్రైవర్లు సూచించిన లోపాలను వెంటనే సరిదిద్ది ప్రయాణికులకు బస్సులను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. మేనేజర్ వై. రవిచంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్