కోటవురట్ల: వెలుగు వీఓఏలు ఆందోళన

74చూసినవారు
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వెలుగు వీఓఏలు ఆందోళన చేపట్టారు. గురువారం కోటవురట్ల మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో యూనియన్ అధ్యక్షురాలు మాణిక్యం, కార్యదర్శి రమణమ్మ మాట్లాడుతూ బకాయి వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ వేధింపులను ఆపాలని మూడు సంవత్సరాల కాలపరిమితిని రద్దు చేయాలన్నారు. అనంతరం ఎంపీడీవోకు వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్