![గజ్జేడి గ్రామంలో గిరిజనులకు తాగునీటి కష్టాలు గజ్జేడి గ్రామంలో గిరిజనులకు తాగునీటి కష్టాలు](https://media.getlokalapp.com/cache/52/16/52162a3052fcc1e9c9d4797994c74857.webp)
గజ్జేడి గ్రామంలో గిరిజనులకు తాగునీటి కష్టాలు
వేసవి దృష్ట్యా అల్లూరి జిల్లాలో పలు మారుమూల గ్రామాల్లో గిరిజనులు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెదబయలు మండలంలోని ఇంజరి పంచాయతీలోని గజ్జేడి గ్రామంలో సరైన తాగునీటి సౌకర్యం లేక గిరిజనులు సమీపంలోని ఊటగెడ్డల కలుషిత నీటిని తెచ్చుకొని అనారోగ్య సమస్యల బారిన పడుతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వాధికారులు స్పందించి గజ్జేడి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించి గిరిజనుల కష్టాలు తీర్చాలని సోమవారం కోరారు.