పొంగులేటి స్వరాజ్యం రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భద్రాచలం కిమ్స్ ఆస్పత్రి వారి సౌజన్యంతో రంపచోడవరం నియోజకవర్గం కూనవరం మండలంలో ఉన్న విజయ సాధన హైస్కూల్ వద్ద ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి సుమారు 400 మంది రోగులకు పలు రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.ఈ వైద్య శిబిరంలో కిమ్స్ ఆస్పత్రి మేనేజ్మెంట్ భీమ్ రెడ్డి బాబురెడ్డి తదితరులు ఉన్నారు.