వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి వివాదంలో పడ్డారు. ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆయన చొక్కాపై వైసీపీ అధినేత జగన్ ఫొటో ఉన్న స్టిక్కర్ ఉండడం వివాదానికి దారితీసింది. రాజకీయ పార్టీల జెండాలు, చిహ్నాలు, స్టిక్కర్లతో స్వామివారి దర్శనానికి రావడం టీటీడీ నిబంధనలకు విరుద్ధం. కానీ అంబటి రాంబాబు ఈ నిబంధనను పట్టించుకోకుండా దర్శనానికి రావడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.