AP: కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో ఆయనకు మంత్రులు లోకేష్, అనితతో పాటు 13 మంది కూటమి నేతలు స్వాగతం పలికారు. కాసేపట్లో అమిత్ షా ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో డిన్నర్ చేస్తారు. రాత్రికి ప్రైవేట్ హోటల్‌లో బస్ చేస్తారు. రేపు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 10వ బెటాలియన్ కార్యాలయం కొత్త క్యాంపస్‌ను ప్రారంభిస్తారు.