శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు మూడో రోజు హైడ్రామా కొనసాగుతుంది. దువ్వాడ ఇంటి ముందు రాత్రిపూట కార్ షెడ్డులోనే భార్య వాణి, కుమార్తె హైందవి ఉన్నారు. తాము ఇంటి నుంచి కదిలేది లేదని దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి, కుమార్తె హైందవి తేల్చి చెప్పారు. గత రెండు రోజులుగా దువ్వాడ ఇంటి ముందే భార్యాబిడ్డలు నిరసన తెలుపుతున్నారు.