నర్సీపట్నం సర్కిల్ పరిధిలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన పోలీస్ అధికారులు స్పీకర్ అయ్యన్నపాత్రుడుని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగా నర్సీపట్నం సిఐ గా బాధ్యతలు స్వీకరించిన రేవతమ్మ, పట్టణ ఎస్సై ఉమామహేశ్వరరావు, మాకవరపాలెం ఎస్సై దామోదర్ నాయుడు, గొలుగొండ ఎస్సై రామారావు, కృష్ణదేవిపేట ఎస్సై దివ్య కలిశారు. చిత్తశుద్ధి అంకితభావంతో పనిచేయాలని ఈ సందర్భంగా స్పీకర్ సూచించారు.