ఎస్. రాయవరం మండలం పెనుగొల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చుట్టూ వరద నీరు నిల్వ ఉండడంతో పారిశుద్ధ్య వాతావరణం నెలకొంది. గత నాలుగు రోజులుగా నీరు అలాగే ఉండడంతో దోమలు విజృంభించి డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆసుపత్రికి వచ్చే రోగులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం వర్షం పడినా ఆసుపత్రి ఆవరణలో ఇదే పరిస్థితి నెలకొంటుందని పలువురు తెలిపారు.