డి. హీరేహాళ్ 25 మందిపై కేసు నమోదు

51చూసినవారు
డి. హీరేహాళ్ 25 మందిపై కేసు నమోదు
డి. హీరేహాళ్ మండలంలోని కల్యం గ్రామంలో జరిగిన ఘర్షణలో 25 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గురుప్రసాద్ రెడ్డి బుధవారం తెలిపారు. కల్యం గ్రామంలో మంగళవారం సాయంకాలం 7. 30 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి ఆటోలో తీసుకెళ్లే విషయంలో ఇరువర్గాలకు చెందిన వారు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో మొత్తం 25మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గురుప్రసాద్ రెడ్డి తెలిపారు.