యాడికి మండలంలోని లక్షుంపల్లి కొండల్లోని నాటుసారా స్థావరాలపై సీఐ ఈరన్న తన సిబ్బందితో సోమవారం దాడులు నిర్వహించారు. నాటుసారా తయారీదారులు పోలీసులను చూసి పారిపోయారు. ఈ సందర్భంగా 500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసి, 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకు న్నామని సీఐ ఈరన్న తెలిపారు. కార్యక్రమంలో పోలీసులు పవన్ కుమార్ రెడ్డి, పెద్దన్న, చంద్ర తదితరులు పాల్గొన్నారు.