యాడికి మండలంలో పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. మండల కేంద్రంలోని చౌడేశ్వరి గుడి వెనకాల ముళ్ళ పొదలలో పేకాట ఆడుతున్న ఏడు మందిని అరెస్ట్ చేసినట్లు సీఐ ఈరన్న ఆదివారం తెలిపారు. వారి వద్ద నుంచి రూ 5200/-నగదుతో పాటు 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. మండల పరిధిలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.