వజ్రకరూరు మండల పరిధిలోని ఉన్న ప్రైవేట్ పాఠశాలలపై వెంటనే చర్య తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకుడు భీమేశ్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ. వసతులు లేని, క్రీడా మైదానం లేని పాఠశాలలను సీజ్ చేయాలన్నారు. లేకుంటే ఉద్యమాలు చేస్తామన్నారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి ఎర్రిస్వామికి శనివారం వినతి పత్రం అందించారు.