Sep 25, 2024, 06:09 IST/
జూ కీపర్‌పై పాండా దాడి.. వైరల్ వీడియో
Sep 25, 2024, 06:09 IST
చైనాలోని ఓ జూలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళా జూ కీపర్‌పై పాండా దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా పాండాలు చాలా ఫన్నీగా ఉంటాయి. ఎవరిపై దాడి చేయవు. అలాంటిది చైనాలోని చాంగ్కింగ్ జూలో డింగ్ డింగ్ అనే తొమ్మిదేళ్ల పాండా కోపంతో తన జూ కీపర్‌పై దాడి చేసింది. జూ కీపర్ డోర్ క్లోజ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.