మయన్మార్‌ను భూకంపం అల్లడిస్తోంది. భూకంపం తీవ్రతకు మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 107 మంది మృతి చెందినట్లు సమాచారం. కూలిన భవనాల శిథిలాల్లో చిక్కుకొని 350 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మయన్మార్‌లోని నేపిడాలో 1000 పడకల ఆస్పత్రి, ఐకానిక్ బ్రిడ్జి, పలుచోట్ల ఎత్తైన ఆలయాలు, గోపురాలు భూకంపం కారణంగా ఒక్కసారిగా కుప్పకూలాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.