సైబర్ నేరాలు నిరోధించాలంటే అవగాహన ఉండాలని అనంతపురం జిల్లా అదనపు ఎస్పీ డీవీ రమణమూర్తి బుధవారం పేర్కొన్నారు. ఎస్పీ ఆదేశాలతో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు సైబర్ సురక్ష కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వీడియోల ద్వారా అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే సందేశాలకు స్పందించవద్దని తెలిపారు.