అనంత : వైసీపీ వచ్చాక చర్యకు.. ప్రతి చర్య తప్పదు: గోరంట్ల మాధవ్

64చూసినవారు
సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారని వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. అనంతపురంలోని తన నివాసంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ, అధికారం ఉందని వైసీపీ శ్రేణులపై దాడులు చేసే టీడీపీకి చెందిన వారిపై వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చాక చర్యకు ప్రతి చర్య తప్పదని హెచ్చరించారు. చట్ట విరుద్ధంగా పనిచేస్తున్నారని పోలీసులపై మండిపడ్డారు. రాష్ట్రానికి సీఎం చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్