అనంతపురంలో దుండగులు బరితెగించారు. ఓ పత్రికా విలేకరి అక్బర్ ద్విచక్ర వాహనంపై దాడి చేసి ధ్వంసం చేశారు. సాయినగర్ లో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఇద్దరు యువకులు బైక్ లో వచ్చి విలేకరి వాహనాన్ని ధ్వంసం చేసి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో వైరల్ అవుతోంది.