Dec 31, 2024, 10:12 IST/
జనవరి 4న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
Dec 31, 2024, 10:12 IST
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం జనవరి 4న సమావేశం కానుంది. సంక్రాంతి నుంచి రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ భేటీ అయి ఈ పథకం అమలుపై చర్చించనున్నారు. అలాగే భూమిలేని పేదలకు నగదు సాయం, కొత్త రేషన్ కార్డులు, టూరిజం పాలసీపై చర్చించే అవకాశం ఉంది.